వ్యాపారం

Uber : మరో 100 సిటీల్లో ‘ఉబెర్’ సేవలు.. ఆ ఏజ్ వారే టార్గెట్!

రవాణా సేవల విభాగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉబెర్..మరిన్ని నగరాల్లో తమ సేవలు విస్తరించేందుకు నిర్ణయించింది.ప్రస్తుతం మెట్రోసిటీస్, రద్దీగా ఉండే నగరాల్లో ఉబెర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇక మీద సెమీ సిటీస్‌లోనూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవలను మరింత వ్యాప్తి చేయాలని కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా టైర్-2, టైర్-3 మార్కెట్లలో సత్తా చాటేందుకు ఉబెర్ యోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మరో 100 నగరాలకు ఉబెర్ తన టూవీలర్ (బైక్) సేవలను విస్తరించింది. మొత్తంగా 18 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 220కు పైగా నగరాల్లో ఉబెర్ రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయి.