క్రైమ్
ఒకే మహిళ కోసం ఇద్దరు.. ఒకరు మృతి, మరొకరి ఇంటికి నిప్పు!
వివాహేతర సంబంధాల మత్తులో పడి కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజా ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఇద్దరు గొడవ పడ్డారు. మహిళ సేఫ్‌గానే ఉండగా.. ఒకరిపైమరొకరు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరు హత్యకు గురవ్వగా.. బాధితుడి బంధువులు హత్యకు పాల్పడిన వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.
