International

కాంగో నదిలో రెండు పడవలు ఢీ.. 60కి పెరిగిన మృతుల సంఖ్య!

 ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈక్వాటూర్ ప్రావిన్స్‌కు చెందిన ఎన్‌గోంబే-లుకోలేలా ప్రాంత సమీపంలో కాంగో నదిపై ప్రయాణిస్తున్న రెండు పడవలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. రాజధాని కిన్షాసా వైపు నుంచి వస్తున్న ‘డైయు సె కాచే’ (Dieu se cache) అనే లోహపు నౌక, బుసింగా వైపు నుంచి వస్తున్న ‘హెచ్‌బీ సూపర్ విక్టోయిర్’ (HB Super Victoire) అనే చెక్క పడవను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.