National
ఉపఎన్నికల్లో గెలిచి 109కి చేరిన టీవీకే బలం.. తప్పని మద్దతు పర్వం!
తమిళనాడులో ఇటీవల జరిగిన మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఘనవిజయం సాధించింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్(CM vijay) నాయత్వంలోని టీవీకే అభ్యర్థులు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందడంతో, శాసనసభలో ఆ పార్టీ బలం 107 నుంచి 109కి పెరిగింది. అన్నాడీఎంకే తరఫున గతంలో గెలిచి, ఆ పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో చేరిన మరగతం కుమారవేల్ (మధురాంతకం), పి.సత్యభామ (ధారాపురం) మళ్లీ అదే స్థానాల నుంచి 'విజిల్' గుర్తుపై పోటీ చేసి విజయం సాధించడం విశేషం.
