తెలంగాణ పాలిటిక్స్‌కు మీనాక్షి గుడ్ బై..!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వీడ్కోలు చెప్పనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ ఎన్నికలు ఉన్నందున ఆమె అక్కడకు వెళ్లేందుకు నిర్ణయించకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి మీనాక్షీ నటరాజన్ తప్పుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ పూర్తయ్యాక తెలంగాణ నుంచి వెళ్తారని తెలుస్తోంది. ఆమెకు త్వరలోనే పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై మీనాక్షీ నటరాజన్ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో తనకు రాజ్యసభ అవకాశం దక్కకుండా..కొందరు రాష్ట్ర నేతలు అడ్డుకున్నారన్న ఆమె తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు సమాచారం.
