Tummidihatti: రేవంత్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర సీఎం.. ప్లాన్ రివర్స్ అయిందే!
Tummidihatti: తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంచి తెలంగాణకు పుష్కలంగా నీళ్లు తేవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహానికి ముంబై గడ్డపై ఊహించని బ్రేక్ పడింది. ఎంతో నమ్మకంతో మహారాష్ట్రకు వెళ్లిన రేవంత్ బృందానికి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన షాక్‌తో ప్లాన్ మొత్తం తలకిందులైంది. అనుమతులు సాధించి విజయవంతంగా తిరిగొద్దామనుకున్న రేవంత్ సర్కార్‌కు ఉత్త కమిటీ ప్రతిపాదన మాత్రమే మిగిలింది.2016లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 148 మీటర్లుగా నిర్ణయించారు. అయితే ఈ ఎత్తుతో తెలంగాణకు సరిపడా నీరు అందదని భావించిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్, బ్యారేజీ ఎత్తును కనీసం 150 లేదా 152 మీటర్ల వరకు పెంచాలని పట్టుబట్టింది. ఇదే అజెండాతో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ముంబై వెళ్లి ఫడ్నవీస్‌తో కీలక మంతనాలు జరిపారు. ఎలాగైనా ఒప్పించి ప్రాజెక్టును పరుగులు పెట్టించాలన్నది వారి వ్యూహం.
