National
కల్తీదారులను వణికిస్తున్న ‘తుకారం ముండే’.. ఆయన ఎవరంటే?
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం ముండే.. మరోసారి వార్తల్లో నిలిచారు. 2026 మేలో FDA కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 3 నెలల్లోనే ఆయన తీసుకున్న వేగవంతమైన చర్యల వలన పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి చిన్న దుకాణాలు, వీధి వ్యాపారుల వరకు ప్రభావం చూపుతున్నాయి. FDA కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆహార భద్రత, పరిశుభ్రతపై ముండే దృష్టి పెట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు, పాఠశాల క్యాంటీన్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన చోట నోటీసులు ఇవ్వడంతో పాటు లైసెన్సుల సస్పెన్షన్ వంటి చర్యలు చేపట్టారు.
