Tube vs Tubeless Tyres: ట్యూబ్ టైరా లేదంటే ట్యూబ్ లెస్ టైరా.. ఏది వేయిస్తే బెటర్?
\Tube vs Tubeless Tyres: కొత్త వాహనం కొంటున్నప్పుడైనా, లేదా పాత బండికి టైర్లు మార్చే టైంలో చాలామందిని వేధించేది ఒక్కటే ట్యూబ్ టైర్ వేయించాలా? లేక ట్యూబ్‌లెస్ టైర్ వేయించాలా? బండి మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మీ ప్రాణాల భద్రత కూడా ఈ టైర్ల ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్? దేనివల్ల ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.రోడ్డుపై వెళ్లేటప్పుడు ఏదైనా మేకు లేదా పదునైన వస్తువు గుచ్చుకుంటే ఈ రెండింటి రియాక్షన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్లో ప్రత్యేకంగా లోపల రబ్బరు గొట్టం ఉండదు. టైరు లోపలి పొరే వీల్ రిమ్కు గట్టిగా లాక్ అయి గాలిని నిలుపుతుంది. మేకు గుచ్చుకున్నప్పటికీ అది టైరులోనే ఇరుక్కుపోయి గాలిని చాలా నిదానంగా మాత్రమే బయటకు పోనిస్తుంది. దీనివల్ల డ్రైవర్‌కు వెహికల్‌పై పూర్తి కంట్రోల్ ఉంటుంది. హైవేలపై వంద స్పీడ్‌లో ఉన్నా ఒక్కసారిగా బండి అదుపు తప్పే ప్రమాదం ఉండదు. పైగా టైరును విప్పాల్సిన పనిలేకుండా బయట నుంచే రెండు నిమిషాల్లో పంక్చర్ వేయించుకోవచ్చు.
