ఏపీ

శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన తితిదే!

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి భక్తులు, సిబ్బంది సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎల్‌ఐసీ ద్వారా బీమా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల బీమా పరిధిని పెంచడంతో పాటు పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించే అంశానికీ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం చేయించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి స్వర్ణ తాపడం కోసం రూ.17.05 కోట్ల ప్రతిపాదనకు పాలక మండలి ఆమోదం తెలిపింది. భక్తుల సౌకర్యాలు, ఉద్యోగుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు తితిదే వెల్లడించింది.