ఏపీ

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత టైం పడుతుందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది.తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, వర్షాలు తగ్గుముఖం పట్టడం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావొస్తుండటంతో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తిరుమలకు క్యూ కడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తిరుమల కొండ మీద భక్తుల రద్దీ సాధారణం కంటే అధికంగా ఉన్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. రూములు దొరకడం లేదని, సత్రాలు అన్ని నిండిపోయినట్టు సమాచారం. రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతుండటంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయినట్టు తెలిసింది. భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నట్టు అధికారులు తెలిపారు.