TTD: ఆ రూమర్లకు చెక్ పెట్టిన టీటీడీ.. మా ఆన్లైన్ సిస్టమ్ పక్కా సేఫ్!
TTD: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో జోరుగా వస్తున్న రూమర్స్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టిగా క్లారిటీ ఇచ్చింది. తమ ఆన్లైన్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా, పూర్తి భద్రతా ప్రమాణాలతో పనిచేస్తోందని స్పష్టం చేసింది. టికెట్ లభించకపోవడానికీ, వ్యవస్థలో లోపాలు ఉండటానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉందని పేర్కొంటూ ఆధారాలతో సహా లెక్కలు విడుదల చేసింది.టికెట్లు నిమిషాల వ్యవధిలోనే ఎందుకు అయిపోతున్నాయో టీటీడీ అధికారిక గణాంకాలతో సహా వివరించింది. టికెట్ల విడుదల సమయంలో ఒకేసారి దాదాపు 6 లక్షల మంది యూజర్లు వెబ్సైట్లోకి వస్తున్నారు. ఒక్కొక్కరు సగటున 4 టికెట్ల కోసం ప్రయత్నిస్తుండటంతో, క్షణాల వ్యవధిలోనే 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడుతోంది. దేవస్థానం వద్ద నెలకు అందుబాటులో ఉండేది దాదాపు 2.69 లక్షల టికెట్లు మాత్రమే. అంటే అందుబాటులో ఉన్న కోటా కంటే 9 రెట్లు అధికంగా పోటీ ఉంటోంది.
