ఏపీ

TTD : తిరుమలకు పోటెత్తారు.. దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. వర్షాలు పెద్దగా లేకపోవడంతో భక్తులు తిరుమలకు వెళ్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయినట్టు సమాచారం. విపరీతంగా భక్తులు వస్తుండటంతో అధికారులు సైతం ఏర్పాట్లు చేయలేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీవీఐపీ దర్శనాలకు టీటీడీ బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం.