National

US: ట్రంప్ డబుల్ గేమ్! రష్యాతో అమెరికా డిజిల్ డీల్..

US: అంతర్జాతీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు బట్టబయలైంది. ఉక్రెయిన్ సంక్షోభం సాకుతో రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై అదనపు పన్నులు వేసిన అగ్రరాజ్యం.. సొంత దేశంలో తిప్పలు మొదలయ్యేసరికి అదే మాస్కో కాళ్ల వద్దకు చేరింది. ఏకంగా రష్యా నుంచే డీజిల్ కొనుగోలు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం డీల్ కుదుర్చుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని అవాక్కయ్యేలా చేసింది.రష్యా నుంచి ముడి చమురు కొనడం వల్ల పుతిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నారంటూ గత కొద్ది నెలలుగా ట్రంప్ గగ్గోలు పెట్టారు. భారత్‌పై ఏకంగా 25 శాతం అదనపు సుంకాలు విధించడమే కాకుండా, రష్యా ఇంధనాన్ని ముట్టుకుంటే 100 శాతం పన్నులు బాదుతామంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచాన్ని బెదిరించారు.