International
ట్రంప్‌నకు 'మెంటల్ ట్రీట్మెంట్' అవసరం.. ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) అమెరికా భూభాగంగా చూపిస్తూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోపై టెహ్రాన్ మండిపడింది. ట్రంప్ వాస్తవాలను గుర్తించలేని భ్రమల్లో బతుకుతున్నారని, ఆయనకు మానసిక నిపుణుల పర్యవేక్షణలో 24 గంటల చికిత్స అత్యవసరమంటూ ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజెమ్ ఘరీబాబాది తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
