International
Trump: ‘ఫ్లైదుబాయ్’ దాడిలో ఇరాన్ హస్తం ఉందా? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్ హమ్మామీ జరిపిన ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని ఆయన ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్న ట్రంప్, తన ఆరోపణలకు అనుగుణంగా ఎలాంటి అధికారిక సమాచారాన్ని బయటపెట్టలేదు. అయితే, ఓ ప్రెస్‌మీట్ విలేకరి ప్రశ్నిస్తూ ఫ్లైదుబాయ్ దాడిలో ఇరాన్ హస్తం ఉందనుకుంటున్నారా? అని అడిగారు. దీనికి ట్రంప్ బదులిస్తూ ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని బదులిచ్చారు.
