International

Trump Impeachment: ట్రంప్‌కు డెమోక్రాట్ల ‘చెక్’.. మూడోసారి అభిశంసన తప్పదా?

Trump Impeachment: మిడ్‌టర్మ్ ఎన్నికల్లో తగిలిన ఊహించని ఎదురుదెబ్బ మరువకముందే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో రాజకీయ సంక్షోభం ముంచుకొస్తోంది. ఇన్నాళ్లూ వివాదాస్పద నిర్ణయాలతో పాలన సాగించిన ట్రంప్‌కు ఈసారి ఎలాగైనా బ్రేకులు వేయాలని డెమోక్రాట్లు డిసైడ్ అయ్యారు. చట్టసభల్లో సాధించిన పూర్తి మెజారిటీని ఆయుధంగా మలచుకుని, ట్రంప్ పీఠానికే ఎసరు పెట్టేలా ‘మూడో అభిశంసన’ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. గతంలో ట్రంప్ తన మొదటి పదవీకాలంలో రెండుసార్లు అభిశంసన తీర్మానాలను ఎదుర్కొన్నారు. అయితే అప్పట్లో సెనెట్‌లో రిపబ్లికన్లకు సంఖ్యాబలం ఉండటంతో అవి వీగిపోయి ట్రంప్ బయటపడ్డారు. కానీ ప్రస్తుత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చట్టసభల్లో డెమోక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో ఈసారి ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా పూర్తిస్థాయి అభిశంసన ప్రక్రియకు గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టారు.