క్రైమ్

TruecallerScam: మహాత్మా గాంధీ' పేరిట వింత కాల్స్.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

గాంధీ జయంతి (అక్టోబర్ 2) సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓ కొత్త రకం సైబర్ ముప్పు ముంచుకొచ్చింది. ప్రజల ఫోన్లకు వచ్చే తెలియని కాల్స్ కాలర్ ఐడీలో ఉన్నట్టుండి 'మహాత్మా గాంధీ' అని పేరు కనిపిస్తుండటంతో పలువురు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అయితే ఇదే క్యూరియాసిటీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త రకం వాయిస్ ఫిషింగ్ ('విషింగ్') మోసమని, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భద్రతా నిపుణులు స్పష్టం చేశారు. ట్రూకాలర్ వంటి కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్‌లు క్రౌడ్ సోర్సింగ్ ఆధారంగా పనిచేస్తాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఒక ప్రత్యేక నంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకుంటారో, అదే పేరును యాప్ ఇతరులకు ప్రదర్శిస్తుంది.