తెలంగాణ
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరపై ట్రోల్స్.. పునరాలోచనలో సర్కార్?
హైదరాబాద్ నగరవాసులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో సులభతర ప్రయాణం కోసం అక్టోబర్ 2న ప్రారంభించిన ‘ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్’ ధరలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించడంతో ఇవి సగటు ప్రయాణికుడికి తీవ్ర ఆర్థిక భారంగా మారాయి. ఫలితంగా ప్రారంభమైన మొదటి వారంలో కేవలం 2నెలవారీ పాస్‌లు, 34 డైలీ పాస్‌లు మాత్రమే అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
