సినిమా

Trisha: టాలీవుడ్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతేనా?

Trisha Krishnan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'లో నటిస్తోంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న త్రిష, చాలా నమ్మకాలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అంటున్నారు. 'విశ్వంభర' రిలీజై హిట్ సాధిస్తే టాలీవుడ్ నుంచి మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశపడింది. కానీ, ఆ ఆశలన్నీ, గల్లంతైయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. దీనికి, కారణం 'విశ్వంభర'పై కాస్త నెగిటివిటీ ఉండటమే. ఈ సినిమా అవుట్‌పుట్ చిరంజీవికే తృప్తిగా అనిపించలేదట.