తెలంగాణ
Trinee IPS : వాళ్లే ప్రపోజ్ చేశారు ఓకే అన్నా.. తప్పేముంది?
హైదరాబాద్లోని జాతీయ పోలీసు అకాడమీలో సహచర ట్రైనీ మహిళ ఐపీఎస్ మీద లైంగికవేధింపులు, దాడి కేసులో అరెస్టు అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో ఆయన షాకింగ్ నిజాలు వెల్లడించినట్టు తెలిసింది. ‘నేను సివిల్స్ సాధించాక నా స్ఫూర్తిదాయక కథనాలు చూసి సోషల్ మీడియాలో వేలమంది అభిమానులుగా మారారు.అందులో కొందరు మహిళలు నాకు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పా.. దాంట్లో తప్పేముంది?’ అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.
