తెలంగాణ
పెండింగ్ బిల్లులు చెల్లించండి- ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ట్రెసా అభ్యర్థన
TRESA: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA-ట్రెసా) రాష్ట్ర ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాని కలిసింది. రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని కోరింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 కాలానికి వాహన అద్దె చార్జీలు చెల్లించకపోవడం వల్ల తహసీల్దార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రెసా ప్రతినిధులు వాపోయారు. పెండింగ్లో ఉన్న తహసీల్దార్ల వాహన అద్దె చార్జీలను వెంటనే విడుదల చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రతి నెల వాహన అద్దె బిల్లులు పెండింగ్లో ఉండకుండా సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కు విజ్ఞప్తి చేశారు.
