National

ఏడాదిలో నాలుగోసారి బదిలీ.. ఐఏఎస్ అధికారిణి తీవ్ర ఆవేదన!

పాలనా వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేసే నిష్పాక్షిక అధికారులపై వేధింపులకు అద్దం పట్టే సంచలన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్‌ సీనియర్ ఐఏఎస్ అధికారిణి నేహా మార్వ్య తనకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై బహిరంగంగా గళమెత్తారు. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఏకంగా నాలుగోసారి బదిలీ కావడం, అదీ కొత్త పోస్టింగ్‌లో బాధ్యతలు స్వీకరించి 50రోజులు కూడా నిండకముందే బదిలీ జాబితాలో తన పేరుండటంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యారు.