National

రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’

రైలులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.ఒక్కసారిగా బోగిలోకి భారీగా పొగ రావడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దిగి పారిపోయారు.రైలులో అగ్నిప్రమాదం సంభవించిందని అంతా భావించినట్టు తెలిసింది. ప్యాసింజర్స్ ఒక్కసారిగా హాహాకారాలు చేయడంతో ఇతర కోచుల్లోని ప్రయాణికులు సైతం అప్రమత్తం అయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దిగేందుకు ప్రయత్నించారు. తీరా విషయం తెలిసే సరికి అంతా శాంతించారు. వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలోని కర్జత్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న కోయినా ఎక్స్‌ప్రెస్ చక్రాల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వెలువడింది.దాంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు.కొద్దిసేపటి వరకు రైల్వే స్టేషన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. టెక్నికల్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి కొన్ని నిమిషాల్లోనే ఈ సమస్యను పరిష్కరించింది