National

TRAI Report: జియో దూకుడు.. ఎయిర్‌టెల్‌కు భారీ షాక్‌.. పడిపోతున్న రెండో అతిపెద్ద సంస్థ!

TRAI Report: భారత టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో దూకుడు ముందు దేశంలోనే రెండో అతిపెద్ద నెట్‌వర్క్ అయిన భారతీ ఎయిర్‌టెల్ నిలబడలేకపోతోంది. కొత్త యూజర్స్‌ని ఆకర్షించడంలో జియో సునామీ సృష్టిస్తుంటే.. ఎయిర్‌టెల్ మాత్రం ఊహించని రీతిలో చతికిలపడింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు మార్కెట్‌లో ఎయిర్‌టెల్ బలహీనపడుతున్న తీరును స్పష్టంగా తేటతెల్లం చేశాయి.ట్రాయ్ లెక్కల ప్రకారం సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు మార్కెట్‌లోకి రాగా, అందులో ఏకంగా 19 లక్షల మంది జియో నెట్‌వర్క్‌నే ఎంచుకున్నారు. ఇదే సమయంలో భారీ అంచనాలు పెట్టుకున్న ఎయిర్‌టెల్ ఖాతాలోకి కేవలం 2 లక్షల మంది కొత్త కస్టమర్లు మాత్రమే వచ్చారు.