అంబర్‌పేటలో విషాదం.. కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ప్రాణాలు తీసుకున్నాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా పోలీసు డిపార్ట్మెంట్లో చేస్తూ బలవంతంగా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. అంబర్పేట్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ముత్తె చంద్రశేఖర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసిన కానిస్టేబుల్..అనంతరం ఉరేసుకున్నాడు. తాను ఉరివేసుకుని చనిపోవాలని అనుకుంటున్నట్టు సదరు యువతికి ముందే చెప్పినట్టు తెలిసింది. భయాందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు మలక్‌పేట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకునేలోపే చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
