రాజకీయాలు

దామోదర, కాంతారావు ఎపిసోడ్‌పై టీపీసీసీ ఆగ్రహం!

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఇటీవలి కాలంలో కామన్ అయిపోయాయి. పదవులు దక్కలేదని కొందరు లాబీయింగ్ చేస్తుండగా.. మరికొందరు నేరుగా పార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.అది కాస్త అధిష్టానం పెద్దలకు తీవ్ర తలనొప్పిగా మారింది. రెండ్రోజుల కిందట మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి దామోదర.. ఎమ్మెల్యే కాంతారావును దూషించినట్టు తెలిసింది.తాజాగా ఈ ఎపిసోడ్‌పై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నేతల మధ్య ఫైటింగ్ విషయం జనాల్లోకి వెళితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అధిష్టానం నష్టనివారణ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు(గురువారం) గాంధీ భవన్ కు రావాల్సిందిగా మంత్రి దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత రావ్‍కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.