తెలంగాణ

పోలీసులతో కేటీఆర్ స్టాఫ్ దురుసు ప్రవర్తన-వీడియో రిలీజ్ చేసిన మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టాఫ్ తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం పోయినా అహంకారం పోలేదా అంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలతో పాటు కేటీఆర్ స్టాఫ్ సైతం రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. విధుల్లో ఉన్న పోలీసులతో కేటీఆర్ సిబ్బంది వ్యవహరించిన తీరుకు సంబంధించి మహేశ్ కుమార్ గౌడ్ ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేటీఆర్ స్టాఫ్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, వారిని రాయలేని భాషలో బూతులు తిట్టడం అందులో ఉంది. దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.