తెలంగాణ
సీఈసీ జ్ఞానేశ్వర్‌ను వెంటనే తొలగించాలి, అరెస్ట్ చేయాలి
CEC Row: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఓటు చోరీ జరుగుతోందన్నది వాస్తవం అన్నారాయన. బీజేపీకి అవసరం ఉన్న చోట ఓటు చోరీ జరుగుతోందన్నారు. ఈసీ చేపట్టిన సర్ ప్రక్రియపై యువతరం ఆందోళన చెందుతోందన్నారు. అందుకే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు.
సీఈసీ జ్ఞానేశ్వర్ ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని, అరెస్ట్ చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. జ్ఞానేశ్వర్ ను తొలిగించాలనే డిమాండ్ తో సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
