సినిమా
‘నా కొడుకేం ఉగ్రవాది కాదు..’ ట్రోలర్స్ పై యష్ తల్లి ఆగ్రహం!
తల్లికి కొడుకుపై ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. అతనికి ఏ చిన్న కష్టం వచ్చినా తనే ముందు నిలబడుతుంది. లోకమంతా కొడుకుని తప్పుపట్టినా, వేలెత్తి చూపినా.. తల్లి మాత్రం అతనికి ఆసరాగా నిలిచి, ప్రేమతో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కొడుకు సంతోషమే తన శ్వాసగా భావించే తల్లి ప్రేమను ఏ మాటల్లోనూ వర్ణించలేము. కన్నడ రాకింగ్ స్టార్ యష్ తల్లి ఆవేదనే ఇందుకు ఉదాహరణ. యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సిక్' చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
