షార్ట్స్ వేసుకున్నారని.. ఓ టూరిస్టు ఫ్యామిలీపై దాడి (వీడియో)
కొందరు మనుషుల వింత ప్రవర్తన కారణంగా ఓ వర్గం ప్రజలపై ద్వేషం పెరుగుతోందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో పుట్టిన ప్రతిఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛతో పాటు నచ్చినట్టు జీవించే హక్కును పుట్టుకతోనే కలిగి ఉంటారు.అలాంటిది కొందరు మతాల పేరిట, కల్చర్ పేరిట అడ్డంకులు సృష్టించడం, వారి స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. వివరాల్లోకివెళితే.. పుణే సమీపంలోని సింహగడ్ కోటకు ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి(39) తన ఫ్యామిలీతో కలిసి సందర్శించడానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న టైంలో ‘సమస్త్ హిందూ బంధవ్ ఆర్మీ’ అనే సంస్థకు చెందిన వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. టూరిస్టుల్లో ఓ మహిళ వేసుకున్న షార్ట్స్.. 8 ఏళ్ల చిన్నారి ధరించిన పొట్టి డ్రెస్‌పై వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇది మన హిందూ సంస్కృతికి విరుద్ధం.. ఇలాంటి దుస్తులతో ఎలా వచ్చారంటూ వారిపై దాడికి పాల్పడినట్టు తెలిసింది.
