Tollywood vs Kollywood : తెలుగులో తమిళ హీరోల హవా.. అక్కడ మన మూవీలకు తిప్పలు
Tollywood vs Kollywood : సినిమాకు భాషా సరిహద్దులు ఉండవని ఎప్పటి నుంచో చెబుతుంటారు. మంచి కథ, బలమైన నటన, ఆకట్టుకునే మేకింగ్ ఉంటే ఏ ప్రాంతం ప్రేక్షకులైనా ఆదరిస్తారనేది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తమిళ హీరోలకు లభిస్తున్న క్రేజ్ చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కోలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు తమ సొంత మార్కెట్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే వసూళ్లు సాధిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలకు సరిపడా థియేటర్లు దక్కడం, అభిమానుల నుంచి ఆ మూవీస్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఇప్పుడు చాలా కామన్‌గా అయ్యింది. మొత్తంగా చూస్తే.. తెలుగు ప్రేక్షకులు సూర్య, కార్తీ, అజిత్, విజయ్ వంటి తమిళ హీరోలను తమ హీరోల్లాగే ఆదరిస్తున్నప్పుడు.. తమిళ ప్రేక్షకులు తెలుగు హీరోలకు అదే స్థాయి అవకాశాలు ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు భవిష్యత్ సినిమాల వసూళ్లు, థియేటర్ కేటాయింపులు, ప్రేక్షకుల రెస్పాన్స్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. రెండు పరిశ్రమల మధ్య హెల్తీ కాంపిటీషన్‌తో పాటు పరస్పర ఆదరణ పెరిగితే దాని ప్రయోజనం చివరకు ప్రేక్షకులకే దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి తెలుగులో తమిళ హీరోలకు దక్కుతున్న ఆదరణ కోలీవుడ్‌లో టాలీవుడ్ హీరోలకు ఎప్పుడు దక్కుతుందనేది
