సినిమా
Tollywood: విశ్వంభర ఆగిపోలేదు..ఇదుగో ప్రూఫ్
Tollywood: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా గురించి గత కొంతకాలంగా రకరకాల వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయిందని, విడుదల విషయంలో స్పష్టత లేదని, అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ వార్తలకు చెక్ పెట్టేలా డబ్బింగ్ వర్క్ జరుగుతున్నట్టుగా అప్డేట్ వచ్చి షాకిచ్చింది.
