సినిమా

Tollywood: పాన్ ఇండియా కథ @ విజయేంద్రప్రసాద్

Tollywood: ఇప్పుడు మనకున్న గొప్ప రచయితల్లో విజయేంద్రప్రసాద్ గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకి కథలు రాయడం ఒక ఎత్తయితే.. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఆ కథను నడిపించడం మరో ఎత్తు. ఈ విషయంలో ప్రముఖ రచయిత కె. విజయేంద్ర ప్రసాద్ కి ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన నుంచి వచ్చిన కథలు కేవలం వినోదాన్ని మాత్రమే అందించకుండా.. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.