సినిమా
Tollywood: వరుస హిట్స్‌తో ఉన్న వెంకీ..బ్రేక్ వేసిన ఆదర్శకుటుంబం..
Tollywood: విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. గత కొంతకాలంగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేష్‌కు ఇటీవల వచ్చిన 'ఆదర్శ కుటుంబం' సినిమా బ్రేక్ వేసినట్టయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది.
