సినిమా

ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో దెబ్బైపోతున్న స్టార్ డైరెక్టర్స్

Tollywood: బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా హిట్ సాధించినా, ఫ్లాప్ మూటగట్టుకున్నా చివరికి ఆ క్రెడిట్ మోయాల్సింది దర్శకుడే. సినిమా హిట్, ఫ్లాప్ గురించి ఎవరూ అంచనా వేయలేరు. పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా ఏ సినిమా ఎందుకు హిట్టౌవుతుందో ఎవరికీ తెలీదు. ఇండస్ట్రీ హిట్ లాంటి పోకిరి కూడా ఎందుకు అంత పెద్ద హిట్టైందో తెలియదన్నాడు పూరి.