భారీ బడ్జెట్ మూవీలు ఎందుకు బోల్తాపడుతున్నాయి?
Tollywood : చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రం మార్మోగుతోంది.. అదే ‘పాన్ ఇండియా’. వందల కోట్ల బడ్జెట్, ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్లు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మునుపెన్నడూ చూడని స్టార్ క్యాస్టింగ్ ఉంటే చాలు.. బాక్సాఫీస్ బద్దలైపోతుందని చాలామంది నిర్మాతలు నమ్ముతున్నారు. కానీ, థియేటర్ల ముందు సీన్ చూస్తుంటే మాత్రం పరిస్థితి తలకిందులవుతోంది. వందల కోట్లు గుమ్మరించినా కథలో సత్తా లేకపోతే ప్రేక్షకులు సింపుల్‌గా నో చెబుతున్నారు. భారీ బడ్జెట్ అంచనాలు తప్పుతుండటానికి, వరుస ప్లాప్‌లకు వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు టాలీవుడ్లో వేడివేడి చర్చకు దారితీస్తున్నాయి.వందల కోట్ల బడ్జెట్లు, హాలీవుడ్ స్థాయి విజువల్స్ సినిమాకు ఆకర్షణ మాత్రమే కానీ.. ఆత్మ కాదు. సినిమాకి అసలైన సోల్ స్టోరీ, ఆకట్టుకునే కథనం మాత్రమే. రీ-షూట్లను తగ్గించి, బడ్జెట్‌పై నియంత్రణ సాధించి, స్టార్ రెమ్యూనరేషన్ల కంటే కంటెంట్‌పై పెట్టుబడి పెట్టినప్పుడే పాన్ ఇండియా కలలు నిజమవుతాయి. లేకపోతే బాక్సాఫీస్ దగ్గర ఈ వందల కోట్ల లెక్కలు తప్పుతూనే ఉంటాయి.
