సినిమా
Tollywood: ఇది ఊహించని కాంబో.. 2028 సంక్రాంతికి ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి సినిమా కన్ఫర్మ్!
Tollywood: అసలు ఏ ఒక్కరు ఊహించని కాంబో తాజాగా ప్రకటించారు. ఆ కాంబో ఎన్టీఆర్ - అనిల్ రావిపూడిలది. ఈ సినిమా కన్ఫర్మ్ చేస్తూ స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించడం విశేషం. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉండబోతుందని గత కొన్ని గంటల క్రితమే వార్త వచ్చి వైరల్ అయింది. ఇది, కనీసం పవన్ అభిమానులు ఆనందపడేలోపే తారక్ బిగ్ షాకిచ్చాడు. నెక్స్ట్ సినిమాను హిట్ మిషన్ అనిల్ రావిపూడితో చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
