సినిమా
Tollywood: మైత్రీ దక్కించుకున్న వారణాసి థియేట్రికల్ రైట్స్..
Tollywood: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ గ్లోబల్ మూవీపై రోజురోజుకీ అంచనాలు రెట్టింపవుతున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
