సినిమా

Tollywood: "మెగావర్స్‌"లో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా!

Tollywood: దిగ్గజ ఓటీ కోసం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మెగావర్స్’ మెగా టాక్ షోపై రోజురోజుకూ అంచనాలు, ఆసక్తి పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ షోకు టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు భాగం కానున్నారు. ఇప్పటికే, బ్రహ్మానందం, అక్కినేని హీరోతో పాటు పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండగా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒకే ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.