సినిమా

Tollywood: టాలీవుడ్‌లో లేట్ మేకింగ్ సిండ్రోమ్.. నిర్మాతలను ముంచుతున్న బద్ధకం!

Tollywood: ఒకప్పుడు సినిమా అంటే స్పష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణ, బౌండ్ స్క్రిప్ట్‌తో కూడిన పరుగులు. ఇప్పుడు సినిమా అంటే నెలల తరబడి లొకేషన్ల ఎంపికలు, సెట్స్ మీద కబుర్లు, ఎడిటింగ్ టేబుల్ వద్ద తర్జనభర్జనలు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి అత్యాధునిక డిజిటల్ కెమెరాలు, హై-ఎండ్ ఎడిటింగ్ సూట్లు, విలాసవంతమైన కారవాన్లు అందుబాటులోకి వచ్చాక సినిమా పనులు రెట్టింపు వేగంతో పూర్తి కావాలి. కానీ టాలీవుడ్‌ను ప్రస్తుతం పట్టిపీడిస్తున్న అసలు సమస్య ‘లేట్ మేకింగ్ సిండ్రోమ్’. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దర్శకుల్లో, నిర్మాణ బృందాల్లో ఆలోచనల క్లారిటీ తగ్గి.. బద్ధకం, అలసత్వం పెరిగిపోతుండటం ఇప్పుడు చిత్ర పరిశ్రమను ఆర్థిక సంక్షోభం వైపు నెడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.