సినిమా
Tollywood - Directors: జెట్ స్పీడ్లో సినిమాను పూర్తి చేస్తున్న డైరెక్టర్స్..
Tollywood: కథ-కథనం, పాత్రల ఎంపిక, బడ్జెట్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ దర్శకుడైనా సినిమాను మూడు నెలల్లో రిలీజ్ చేస్తారనడానికి పూరి జగన్నాధ్ పెద్ద ఉదాహరణ. ఆయనలా వారం రోజుల్లో కథ, ఇంకో వారం రోజుల్లో డైలాగ్స్ కంప్లీట్ చేసే దర్శకరచయిత ఇంకొకరు ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రీలో లేడనే చెప్పొచ్చు. 60 రోజుల్లో షెడ్యూల్ కంప్లీట్ చేయడం పూరికే సాధ్యమైంది. ఇంకా, తక్కువ రోజుల్లోనూ పూర్తి చేసిన సినిమాలున్నాయి.
