సినిమా

ప్రేక్షకులు బ్రహ్మరథం.. ఇండస్ట్రీ మౌనం!.. "ఇరుముడి" పై ఇదేం తీరు?..

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఇరుముడి పెద్ద హిట్టయింది. ఇంతటి విజయాన్ని సాధించిన ఇరుముడి టీమ్ ను మెగా కాంపౌండ్ హీరోలు అభినందించారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ట్వీట్ వేశారు. చిరంజీవి టీమ్ ను తన ఇంటికి ఆహ్వానించి అభినందించారు. రవితేజను ఆలింగనం చేసుకొని మరీ మెచ్చుకున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా కనిపించాడు. ఈ సినిమా థియేటర్లలోకొచ్చి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకుని, టీమ్ ను అభినందించక పోవడం విడ్డూరంగా మారింది. టాలీవుడ్ అంటే ఒక కుటుంబం, మేమంతా ఒక్కటే అని చెప్పుకునే సోకాల్డ్ ప్రముఖులెవ్వరూ ఇరుముడి విజయంపై స్పందించక పోవడం శోచనీయం..