సినిమా
Tollywood: అదుర్స్ లాంటి కథతో అనిల్-ఎన్టీఆర్..!
Tollywood: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లను ప్రకటించిన వెంటనే అంచనాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే ఎన్టీఆర్, అనిల్ రావిపూడిలది కావడం విశేషం. ఇప్పటివరకు.. యాక్షన్, మాస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సాధించుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు మళ్లీ తనలోని కామెడీ టైమింగ్‌ను బయటకు తీసేందుకు అనిల్ రావిపూడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ తోడవడంతో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.
