ఏపీ
Tirupati: శ్రీవారి దర్శనానికి వెళ్తే ఇదేం పరిస్థితి బాబోయ్!!..
తిరుపతిలో గరిష్ఠ చిల్లర ధరలకు తిలోదకాలు ఇచ్చారు. ప్రధానంగా భక్తులు, యాత్రికులు, ప్రయాణికులను యథోచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ ఇది మరింత అధికంగా ఉంటోంది. నాసిరకం వస్తువులు అంటగట్టడం, ప్రతిదానిపై రూ.5 నుంచి రూ.10 అదనంగా దండుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. బస్టాండ్‌లోని ఓ దుకాణంలో రూ.20 నీటి బాటిల్‌కు ఏకంగా రూ.30 వసూలు చేశారు. లేదంటే ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు.
