క్రైమ్
తిరుపతిలో ఘోర ప్రమాదం.. భారీ క్రేన్ పడి ముగ్గురు మృతి
Tirupati: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భారీ క్రేన్ బోల్తా పడింది. స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా ఈ ఘోరం జరిగింది. డీబీఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సమీపంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో ఉపయోగించేందుకు భారీ క్రేన్ తెచ్చారు. ఆ క్రేన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ క్రమంలో పునాదుల దగ్గర పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు క్రేన్ కింద చిక్కుకుని చనిపోయారు.
