ఏపీ
Tirumala: భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ కోటా షెడ్యూల్ విడుదల!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026 నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టోకెన్లు మరియు వసతి గదుల ఆన్లైన్ విడుదల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుకింగ్స్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంతో డిమాండ్ ఉండే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం భక్తులు ఆగస్టు 18 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందినవారు ఆగస్టు 22 మధ్యాహ్నంలోగా సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
