ఏపీ
Tirumala Hundi Income: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్క నెలలో రూ.140 కోట్లు
శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.140.28 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక్క జూలై నెలలోనే ఈ ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ చరిత్రలో ఒక నెలలో ఇంత ఆదాయం నమోదవడం ఇది రెండోసారి అని టీటీడీ తెలిపింది. 2022 ఆగస్టు నెలలో 140.34 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
