వ్యాపారం
యాపిల్‌లో ముగిసిన టిమ్ కుక్ శకం.. నూతన సారథిగా జాన్ టెర్నస్!
ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) నాయకత్వంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. గడిచిన 15ఏళ్లుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా కంపెనీని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన టిమ్‌కుక్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి యాపిల్ నూతన సీఈఓగా జాన్ టెర్నస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 2011 ఆగస్టులో దిగ్గజ నేత స్టీవ్ జాబ్స్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన టిమ్‌కుక్, ఇకపై యాపిల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.
