Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?
Ticket Price Hike : స్టార్ హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెరగడం ఇప్పుడు చాలా కామాన్ అయ్యింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా మార్కెట్ అంటూ టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. అయితే వందల కోట్లు ఖర్చు చేస్తున్నామనే కారణంతో ప్రేక్షకులపై టికెట్ ధరల భారం మోపడం ఎంతవరకు కరెక్ట్? అసలు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు నిజంగా అవసరమేనా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి నెలకొంది. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు టికెట్ హైక్స్ ఉంటాయా? లేదంటే నార్మల్ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.ఇదే సమయంలో ప్రేక్షకుల నుంచి ఒక వాదన వినిపిస్తోంది. సినిమా ఎంత పెద్దదైనా సరే టికెట్ ధర అందుబాటులో ఉంటేనే కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరుగుతుందని.. మంచి కంటెంట్ ఉంటే వసూళ్లు ఆటోమేటిక్‌గా పెరుగుతాయని ఇటీవల రిలీజ్ అయ్యి హిట్లు, సూపర్ హిట్లు కొట్టిన కొన్ని సినిమాలు నిరూపించాయని చెబుతున్నారు.
