తెలంగాణ

కాంట్రాక్టర్లకు బెదిరింపులు.. మంత్రి పేరిట విద్యాశాఖ ఇంజినీర్ దందా!

మంత్రి పేరు చెబుతూ ఓ విద్యాశాఖ ఇంజినీర్ కాంట్రాక్టుల దందా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తన బినామీ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు, మిగతా కాంట్రాక్టర్లను పోటీ నుండి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ప్రహరీ నిర్మించే పనికోసం రూ.3.73 కోట్లతో అధికారులు టెండర్లు పిలిచారు.అయితే, ఆ టెండర్‌లో ఆరు కంపెనీలు పోటీ పడగా ఓ కంపెనీకి అర్హత లేదని తప్పించారు.